Monday, July 23, 2007
అందమైన తెలుగు కథలు
మీలో ఎవరైనా నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అనే రచయితను ఎరుగుదురా? ఆయన రాసిన "మిట్టూరోడి పుస్తకం" అనే పుస్తకంలో రాయలసీమ పల్లెల్లోని జీవితాన్నీ, భాషనూ కళ్ళకు కట్టినట్టు రాసారు. అవి ఎంత touching గా ఉంటాయో చదివి హౄదయంతో అర్థం చేసుకోవలసిందే కానీ వర్ణించడం కుదరదు. ఆ accent ని అర్థం చేసుకోగలిగితే మన మనసులని కరిగించే కతలు అవి. అలాగే చాల కాలం క్రితం తెలుగు వీక్లీ, పేరు ఆంధ్ర జ్యోతి అనుకుంటాను, అందులో మహమ్మద్ ఖదీర్ బాబు అనే రచయిత ఇలాగే తన బాల్యాన్నీ, తన ఊరునీ, మనుష్యులనీ, అన్నీ కలిపి తన అందమైన బాల్యాన్ని చక్కని కథలుగా వ్రాసారు. నాలాగా చదివే ఆసక్తి ఉన్న అందరు మంచి అభిరుచి కలిగిన తెలుగు పాఠకులందరూ వీటిని చదివి నాలాగే మానసికోల్లాసం పొందాలని నా ఆశ. వంశీ గారు కూడా కోస్తా ప్రాంతాన్నీ, గోదావరి నది అందానీ "మా పసలపూడి కతలు" లో మరింత అందంగా కల్లకు కట్టారు. అందులోని కొన్ని భాగాలను మీతో పంచుకోవాలని ఉంది. ఎవరికైనా ఆసక్తి కలిగితే తప్పక పంచుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీ బ్లాగు చాలా బాగుంది. దీనిని జల్లెడకు కలపడం జరిగినది.
http://jalleda.com
Hi nice site
do me favour can you exchange my freeonlinemovie links through your site and i will do the same
www.andhratalkies.co.nr
www.reddimohan.co.nr
thanks
Post a Comment